Waqf Bill: లోక్ సభలో అమిత్ షా వర్సెస్ అఖిలేష్ యాదవ్

లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్.. కేంద్రహోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం జరిగింది.

Update: 2024-08-08 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధినేత, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్.. కేంద్రహోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్ సభ స్పీకర్ తోపాటు ప్రతిపక్ష ఎంపీల హక్కులు కాలరాస్తున్నారని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. " మీ(లోక్ సభ స్పీకర్) హక్కులు, మా(ప్రతిపక్ష ఎంపీల) హక్కులు కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యానికి స్పీకరే న్యాయమూర్తి అని మీకు చెప్పాను. హక్కులు హరిస్తున్నారు. మీకోసం మేం పోరాల్సి వస్తుంది” అని అన్నారు. స్పీకర్ తరఫున తాము పోరాడుతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను కేంద్రహోంమంత్రి అమిత్ షా ఖండించారు. అఖిలేష్ వ్యాఖ్యలు స్పీకర్ పదవిని అవమానించినట్లే అని ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్ హక్కుల పరిరక్షకులు కాదని మండిపడ్డారు. మరోవైపు, తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దని స్పీకర్ ఓంబిర్లా అన్నారు. సభలోని ఇతరులు స్పీకర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు.


Similar News