పోలీస్ స్టేషన్‌లో పొట్టు పొట్టు కొడుతున్న దృశ్యం.. అఖిలేష్ యాదవ్ షేర్ చేసిన వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: యూపీ ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓ వీడియోను..Akhilesh tweets video of cops thrashing protesters, police assures action
దిశ, వెబ్ డెస్క్: యూపీ ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు. శనివారం రాత్రి కొందరు పోలీసులు లాకప్ లో ఉన్న కొంతమందిని లాఠీలతో కొడుతున్న వీడియోను షేర్ చేసి ఫైర్ అయ్యారు. పోలీస్ కస్టడీలో మృతిచెందినవారి సంఖ్య విషయంలో యూపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అన్నారు. అదేవిధంగా మానవ హక్కుల ఉల్లంఘన, దళితుల అణిచివేతలో కూడా యూపీ ముందంజలో ఉందని ఆయన ఆరోపించారు. పోలీస్ ఉన్నతాధికారులు దీనిపై మాట్లాడుతూ.. ఈ విషయంలో పూర్తిగా పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. శుక్రవారం రోజు యూపీలో అనేక జిల్లాల్లో చెలరేగిన హింసాత్మక ర్యాలీలు, ధర్నాలలో పాల్గొన్నవారిపై పోలీసులు విరుచుకుపడిన వెంటనే అఖిలేష్ యాదవ్ ఈ వీడియోను ట్వీట్ చేశారని అందులో పేర్కొన్నారు.