Akharas : కుంభమేళాలో హిందూయేతరుల ఫుడ్ స్టాల్స్‌పై బ్యాన్ విధించాలి : అఖారా పరిషత్

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా జరగనుంది.

Update: 2024-10-09 14:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళా జరగనుంది. ఈ కుంభమేళాలో హిందూయేతరులకు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పురి డిమాండ్ చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుకు కేవలం హిందువులకే అనుమతులు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ సర్కారును కోరారు. కుంభమేళాలో వినియోగిస్తున్న పలు ఉర్దూ పదాల స్థానంలో హిందీ పదాలను వాడుకలోకి తేవాలన్నారు.

‘షాహీ స్నాన్’ బదులుగా ‘రాజసీ స్నాన్’.. ‘పేష్వాయీ’ బదులుగా ‘ఛావ్నీ ప్రవేశ్’ పదాలను వినియోగించాలని రవీంద్ర పురి పేర్కొన్నారు. గత కొన్ని శతాబ్దాలుగా కుంభమేళాలో హిందీ పదాలనే వాడుతున్నారని ఆయన చెప్పారు. మద్యం, మాంసం ముట్టని పోలీసు సిబ్బందినే కుంభమేళా ఏరియాలో మోహరించాలన్నారు. దీపావళి పండుగ తర్వాత ఈ ప్రతిపాదనలపై తాము (అఖిల భారతీయ అఖారా పరిషత్) తీర్మానాన్ని ఆమోదించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేస్తామని ఆయన వెల్లడించారు. తదుపరిగా వాటిపై సీఎం యోగి తుది నిర్ణయం తీసుకుంటారని రవీంద్ర పురి చెప్పారు. 


Similar News