21 నియోజక వర్గాల ఫలితాలపై అనుమానాలు : ఈసీకి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హరియాణా(Hariyana) ఎన్నికల ఫలితాల(Election Results)పై తమకు సందేహాలున్నట్టు కాంగ్రెస్ ఏఐసీసీ(AICC) పెద్దలు బుధవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-10-09 14:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : హరియాణా(Hariyana) ఎన్నికల ఫలితాల(Election Results)పై తమకు సందేహాలున్నట్టు కాంగ్రెస్ ఏఐసీసీ(AICC) పెద్దలు బుధవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. హరియాణా ఫలితాలను తాము అంగీకరించబోమని పేర్కొన్న నేతలు.. తమ విజయాన్ని బీజేపీ బలవంతంగా లాక్కుందని మండిపడ్డారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం నేడు ఈసీకి ఫిర్యాదు చేసింది. హరియాణా ఎన్నికల అధికారులపై, ఈవీఎంల మీద తమకు అనుమానాలు ఉన్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేడా మాట్లాడుతూ.. ఇప్పటికే 7 అసెంబ్లీ నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు మీద ఇప్పటికే ఫిర్యాదు చేశామని.. మరో 13 నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు మీద త్వరలోనే ఈసీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అలాగే పలు నియోజక వర్గాల్లో ఈవీఎం బ్యాటరీలు పనిచేయలేదని, అయినప్పటికీ అక్కడ పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని పవన్ ఖేడా ఈసీని కోరారు.


Similar News