Russia-Ukraine War : మాస్కోలో ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత

రష్యా - ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు(Drone Attacks) చేస్తోంది.

Update: 2024-11-10 12:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : రష్యా - ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు(Drone Attacks) చేస్తోంది. రష్యా రాజధాని మాస్కో(Moscow)ను టార్గెట్ చేస్తూ 17 డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని డోమోడెడోవో, జుకోవో ఎయిర్‌పోర్ట్‌లను తాత్కాలికంగా మూసివేసినట్టు మాస్కో మేయర్ తెలిపారు. ఈ దాడుల వలన పలువురు గాయపడ్డారని, వారిని ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నామని.. అయితే ప్రాణనష్టం మాత్రం జరగలేదని వెల్లడించారు. గత కొంతకాలంగా రష్యా ఉక్రెయిన్ మీద జరుపుతున్న క్షిపణుల దాడులకు ప్రతీకారంగానే ఉక్రెయిన్ ఈ డ్రోన్ దాడులకు దిగినట్టు తెలుస్తోంది.    

Tags:    

Similar News