టికెట్‌ డబ్బులు రిటర్న్‌.. ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు

అమెరికాకు వెళ్లాల్సిన విమానం రష్యాకు దారి మళ్లింపు, అక్కడ అరకొర సౌకర్యాల నడుమ ప్రయాణికుల అవస్థల వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది.

Update: 2023-06-08 13:05 GMT

న్యూఢిల్లీ: అమెరికాకు వెళ్లాల్సిన విమానం రష్యాకు దారి మళ్లింపు, అక్కడ అరకొర సౌకర్యాల నడుమ ప్రయాణికుల అవస్థల వ్యవహారంపై ఎయిరిండియా స్పందించింది. ప్రయాణికులందరికీ క్షమాపణలు తెలియజేస్తూ.. వాళ్ల టికెట్‌ డబ్బులను తిరిగి ఇవ్వడంతో పాటు బోనస్‌గా ట్రావెల్‌ వౌచర్లను ఇస్తామని ప్రకటించింది. 

మంగళవారం న్యూఢిల్లీ నుంచి శాన్‌ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న క్రమంలో ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లోని ఇంజిన్‌లో  సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 216 మంది ప్యాసింజర్లు, 16 మంది సిబ్బందితో కూడిన విమానాన్ని రష్యాలోని మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. మాస్కో నుంచి 10వేల కిలోమీటర్ల దూరంలో ఈ మారుమూల పట్టణం ఉంది.

అయితే దాదాపు 36 గంటల తర్వాత.. ప్రత్యామ్నాయ విమానం అక్కడికి చేరుకుని ఈ ఉదయం శాన్‌ ఫ్రాన్సిస్కోకు ప్రయాణికులను చేర్చింది. ఈ పరిణామంపై క్షమాపణలు చెబుతూ ఎయిర్‌ ఇండియా చీఫ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్ గ్రౌండ్‌ హ్యాండిలింగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ డోగ్రా ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags:    

Similar News