Uttarakhand: కేదార్ నాథ్ లో చిక్కుకున్న 133 మంది తరలింపు

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన కొందరు భక్తులు అక్కడ వరదల్లో చిక్కుకున్నారు.

Update: 2024-08-05 07:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే, కేదార్ నాథ్ యాత్రకు వెళ్లిన కొందరు భక్తులు అక్కడ వరదల్లో చిక్కుకుతున్నారు. వందలాది మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం , ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కేదార్‌నాథ్‌ లోయలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నారు. ఎమ్‌-17, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ హెలికాప్టర్లు, చినూక్‌ హెలికాప్టర్లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. సుమారు 133 యాత్రికులను ఐఏఎఫ్‌ దళం సోమవారం ఉదయం రక్షించింది.

హిమాచల్ లో 13కి పెరిగిన మృతుల సంఖ్య

హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో భారీగా వరదలు సంభవించాయి. మండి, సిమ్లా జిల్లాల నుంచి వరదలో గల్లంతైన మరో నలుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో డెడ్ బాడీల సంఖ్య 13కి పెరిగింది. జూలై 31న కులు ప్రాంతం నుంచి 40 మంది ఆచూకీ గల్లంతయ్యింది. స్నిపర్ డాగ్ స్క్వాడ్, డ్రోన్లు సహా ఇతర పరికరాలను మోహరించి అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.


Similar News