ఆమెకు ఇక నాలుగు కిడ్నీలు.. ఎందుకు ?

దిశ, నేషనల్ బ్యూరో : ఎవరికైనా రెండు కిడ్నీలే ఉంటాయి.

Update: 2024-03-17 12:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎవరికైనా రెండు కిడ్నీలే ఉంటాయి. మనకున్న రెండు కిడ్నీల్లో ఒకటి పాడైనా.. తగిన వైద్యం పొందుతూ ఇంకోదానితో మనం జీవితాన్ని కొనసాగించొచ్చు. అయితే తాజాగా ఓ 51 ఏళ్ల మహిళకు శరీరంలో ఉన్న కిడ్నీల సంఖ్య నాలుగుకు పెరిగింది. అదెలా ? అనుకుంటున్నారా ? ఆమెకు రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. దీంతో జీవితంపై ఆశ వదులుకుంది. ఈ తరుణంలో ఆమెకు లైఫ్‌పై ఆశను రేకెత్తించే కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన 78 ఏళ్ల మహిళకు చెందిన రెండు కిడ్నీలను దానం చేసేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులకు అంగీకారం తెలిపారు. దీంతో చనిపోయిన మహిళ శరీరంలోని రెండు కిడ్నీలను తీసి.. 51 ఏళ్ల మహిళ శరీరంలో అమర్చారు. పాత కిడ్నీలను తొలగించకుండానే.. వాటికి సమాంతరంగా ఎగువ భాగంలో ఒక కిడ్నీపై మరో కిడ్నీని సర్జరీ ద్వారా అమర్చి, మూత్రాశయ వ్యవస్థకు అనుసంధానించారు. ఎయిమ్స్ ఢిల్లీలో ఒకేసారి రెండు కిడ్నీలను ఈవిధంగా మార్చి సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కిడ్నీలు అమర్చుకున్న రోగి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.

Tags:    

Similar News