AGNIVEER: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. అగ్నివీర్, అగ్నిపథ్ నియామకాలపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ కీలక ప్రకటన
అగ్నివీర్, అగ్నిపథ్ నియాకాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: అగ్నివీర్, అగ్నిపథ్ నియాకాలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమలవుతున్న ఆ రెండు స్కీమ్‌లలో అవసరమైతే మార్పులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే అగ్నివీర్, అగ్నిపథ్‌లో చేరిన అభ్యర్థులకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తిచి అలాంటి వారిని నేరుగా సాయుధ బలగాల్లో తీసుకుంటామని అన్నారు. అగ్నివీరుల భవిష్యత్తు రక్షణకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్, అగ్నిపథ్ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుతామంటూ రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు. కాగా, 2022లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అగ్నిపథ్ పథకం ద్వారా 17 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గల యువతను నాలుగేళ్ల సర్వీసు కోసం ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి నెలవారీగా రూ.30 నుంచి 40 వేల మధ్య వేతనం వస్తుంది. నాలుగేళ్లు పూర్తయ్యాక ఇందులో 25 శాతం అగ్నివీరులు మాత్రమే శాశ్వత సైనిక ఉద్యోగాల్లోకి ఎంపిక అవుతారు.