'బీజేపీ ఓ విషసర్పం'.. ఉదయనిధి స్టాలిన్‌ సంచలన కామెంట్స్

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

Update: 2023-09-11 13:12 GMT

చెన్నై : డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ విష సర్పంలాంటిదని ఆయన కామెంట్ చేశారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందన్నారు. తమిళనాడులోని నైవేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అనే ఇంటిలోకి చొరబడిన బీజేపీ అనే విష పాము దాక్కునేందుకు.. అన్నా డీఎంకే అనే చెత్త ఆశ్రయాన్ని కల్పిస్తోందన్నారు. ఆ చెత్త పార్టీని రాష్ట్రం నుంచి తీసేసే వరకు బీజేపీ అనే విషపు పాము కూడా దూరం కాదని ఉదయనిధి పేర్కొన్నారు. ఇటీవల డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా మాట్లాడుతూ.. ప్రధాని మోడీని పాముగా అభివర్ణించారు.


Similar News