Manipur: మణిపూర్‌ సర్కార్ కీలక నిర్ణయం..

Update: 2023-09-27 12:09 GMT

ఇంఫాల్ : మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న దృష్ట్యా 19 పోలీస్‌ స్టేషన్లు మినహా రాష్ట్రంలోని అన్నిచోట్లా సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) మళ్లీ అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబరు 1 నుంచి ఆరు నెలల పాటు ఈ చట్టాన్ని అమలు చేస్తామని తెలిపింది. తరుచూ ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ఏఎఫ్ఎస్పీఏను అమల్లోకి తేవాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు.సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం నుంచి మినహాయించి ప్రాంతాల్లో రాష్ట్ర రాజధాని ఇంఫాల్ కూడా ఉంది.

వాస్తవానికి ఇక్కడే ఎక్కువగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కానీ అక్కడ ఏఎఫ్ఎస్పీఏ అమలుకు ఆదేశాలు ఇవ్వకపోవడం గమనార్హం. మణిపూర్‌లో హింస పెరుగుతున్న నేపథ్యంలో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌‌లలోనూ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం అమలును కేంద్ర సర్కారు ఇటీవల పొడిగించింది. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాతే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు.


Similar News