అమర్‌నాథ్ యాత్ర.. కొత్త అప్‌డేట్ ఏమిటో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : అమర్‌నాథ్ యాత్ర ముందస్తు రిజిస్ట్రేషన్లు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి.
దిశ, నేషనల్ బ్యూరో : అమర్‌నాథ్ యాత్ర ముందస్తు రిజిస్ట్రేషన్లు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు 52 రోజులపాటు జరిగే ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అమర్‌నాథ్ తీర్థక్షేత్ర బోర్డు తెలిపింది. ఈ సీజన్‌లో హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న గుహలో మంచులింగం ఏర్పడుతుంది. దాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి 141 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్ పవిత్ర గుహ ఉంది. గుహలోని మంచులింగాన్ని స్థానికులు 'బాబా బర్ఫానీ' అని పిలుస్తుంటారు.