రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన అదానీ గ్రూప్

ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ద్వారా అదనంగా 1 బిలియన్ డాలర్లు సేకరించాలని భావిస్తున్నాం.

Update: 2024-06-25 10:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తన పోర్ట్‌ఫోలియోలోని కంపెనీల్లో రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉందని గ్రూప్ సీఎఫ్‌వో జుగేందర్ రాబీ సింగ్ అన్నారు. పోర్టులు, ఇంధనం, విమానాశ్రయాలు, కమోడిటీలు, సిమెంట్‌, మీడియాతో సహా తమ పోర్ట్‌ఫోలియో కంపెనీల్లో 70 శాతం పెట్టుబడులను స్వయంగా నిధులు సమకూరుస్తామని, మిగిలిన మొత్తాలను అప్పుల ద్వారా సమీకరించనున్నట్టు చెప్పారు. ఏడాదిలో మెచ్యూర్ అవనున్న 3-4 బిలియన్ డాలర్ల రుణాలను రీఫైనాన్స్ చేస్తామని, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ద్వారా అదనంగా 1 బిలియన్ డాలర్లు సేకరించాలని భావిస్తున్నాం. కొత్త ఇన్వెస్టర్ల నుంచి ఏటా 2-2.5 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాదిలో కొన్ని ప్రాజెక్టులు పూర్తవనున్నాయి. పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ 6-7 గిగావాట్ల ప్రాజెక్టును పూర్తి చేస్తుందని, అదే సమయంలో సోలాఫ్ వేఫర్ తయారీని అందుబాటులో రానుండటం, ముంబైలో కొత్త విమానాశ్రయం కూడా పూర్తవుతుందని జుగేందర్ రాబీ సింగ్ పేర్కొన్నారు. 


Similar News