కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన AAP ఎంపీలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిన్న సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను నిన్న సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. అరెస్టు చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. సీబీఐ అధికారిక దరఖాస్తును అనుసరించి కేజ్రీవాల్ అరెస్టుకు అనుమతినిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ ను ఉదయం కోర్టుకు తీసుకొచ్చారు. తిరిగి జూన్ 29 న రాత్రి 7 గంటలలోపు కోర్టు ఎదుట హాజరు పర్చాలని రౌస్ అవెన్యూ వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ఆర్డర్ ఇచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటుచేసుకుంది. నేడు పార్లమెంట్ లో జరగనున్న రాష్ట్రపతి ప్రసంగాన్ని కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆప్ ఎంపీలు బహిష్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.