పంజాబ్‌లో ఆప్ వ్యవసాయాన్ని నాశనం చేసింది: ప్రధాని నరేంద్ర మోడీ

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పరిశ్రమలు, వ్యవసాయాన్ని నాశనం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. రాష్ట్రంలోని హోషియాపూర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు.

Update: 2024-05-30 09:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పరిశ్రమలు, వ్యవసాయాన్ని నాశనం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. రాష్ట్రంలోని హోషియాపూర్‌లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. దశాబ్దాల తర్వాత కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ ప్రభుత్వం రాబోతుందని దీమా వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశం అపూర్వమైన అభివృద్ధిని సాధించిందన్నారు. పేదల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్‌కు కూడా రుజువు కావాలని కోరిందని, అంతేగాక సైన్యాన్ని సైతం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను కూడా ఖాళీ చేశారన్నారు. ఇండీ కూటమి ప్రజలు నన్ను నోరు విప్పనివ్వరని, ఒక వేళ విప్పనిస్తే ఏడు తరాల పాపాలను బయటపెడతానని అన్నారు. అవినీతిలో కాంగ్రెస్ పార్టీ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ఆరోపించారు. పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలోని అడంపూర్ విమానాశ్రయానికి గురు రవిదాస్ పేరు పెట్టాలనేది తన కోరిక అని చెప్పారు. కాగా, జూన్ 1న జరగనున్న చివరి దశ పోలింగ్‌కు గురువారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. 


Similar News