'గుజరాత్‌లో వారితో కలిసి పోటీ చేస్తాం'.. లోక్‌సభ ఎన్నికలపై ఆప్ క్లారిటీ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసుదన్ గధ్వి వెల్లడించారు.

Update: 2023-08-07 16:49 GMT

గాంధీనగర్: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసుదన్ గధ్వి వెల్లడించారు. అయితే సీట్ల పంపకంపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపడానికి అనువైన నియోజకవర్గాలను గుర్తించేందుకు ఇప్పటికే రీసెర్చ్ మొదలుపెట్టామని ఆయన చెప్పారు. "ఇప్పుడు 26 ఎంపీ సీట్లన్నీ బీజేపీ చేతిలో ఉన్నాయి.. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆ 26 స్థానాలను మళ్లీ బీజేపీ గెలుచుకోలేదని నేను నమ్మకంగా చెబుతున్నాను" అని ఇసుదన్ గధ్వి పేర్కొన్నారు.

గాధ్వి ప్రకటనపై గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి స్పందిస్తూ.. "రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇండియా కూటమిలోని జాతీయ నాయకులే నిర్ణయిస్తారు. ఆ విషయం రాష్ట్ర నాయకత్వం చేతిలో లేదు" అని అన్నారు. "ఆప్ అనేది కాంగ్రెస్‌కు బీ టీమ్ అని నిరూపితమైంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పొత్తులకు భయపడదు" అని గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి రుత్విజ్ పటేల్ చెప్పారు.


Similar News