ఫస్ట్ నైట్ అంటే భయపడ్డ వరుడు.. నైటంతా వధువుకు దొరక్కుండా..!
పెళ్లి రెండు అక్షరాలైనా ఇద్దరి మనుషుల నూరేళ్ల జీవితం ముడి పడి ఉంటుంది. అంతే కాకుండా ఎన్నో ఆశలతో నూరేళ్ల జీవితం ప్రారంభిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి రెండు అక్షరాలైనా ఇద్దరి మనుషుల నూరేళ్ల జీవితం ముడి పడి ఉంటుంది. అంతే కాకుండా ఎన్నో ఆశలతో నూరేళ్ల జీవితం ప్రారంభిస్తారు.ఇక పెళ్లి అంటే ఎన్నో తంతులు ఉంటాయి. అమ్మాయి, అబ్బాయి ఒకే అనుకున్నప్పటి నుంచి పదహారు పండుగ దాక ప్రతి రోజూ ఓ పండుగనే.
ఇక పెళ్లి అంటే ఒక్కో తంతుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందులో ముఖ్యంగా పెళ్లి తర్వాత చాలా జంటలు ఆసక్తిగా ఎదురు చూసేది. మొదటి రాత్రి కోసం. చాలా మంది ఈరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటిది ఫస్ట్ నైట్ రోజే ఓ నవ వరుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఫస్ట్ నైట్ రోజు తన కోసం భార్య పూలు, పాలతో ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం పారిపోయి పక్కింట్లో దాక్కున్నాడు. దీంతో కంగారు పడిన వధువు, వరుడి ఫ్యామిలీ మెంబర్స్ రాత్రంతా యువకుడి కోసం వెతకడం ప్రారంభిచారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఇక తెల్లవారు జామున పోలీస్ కంప్లీడ్ ఇద్దామని రాత్రి మొత్తం మెలుకువతోనే భయం, భయంగా గడిపారు. కానీ తెల్లవారు జామున పక్కింటి నుంచి యువకుడు రావడంతో వధువుతో పాటు వరుడు కుటుంబసభ్యులంతా షాక్ అయ్యారు. రాత్రి ఎక్కడికి వెళ్లావంటూ నెలదీయగా యువకుడు సంచలన కామెంట్స్ చేశారు. నాకు ఫస్ట్ నైట్ అంటే భయం వేసింది. అందుకే ఇలా పారిపోయాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ స్థానిక వార్తా పత్రిక ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది.