డాక్టర్‌ల భద్రతపై కోర్టు సంచలన నిర్ణయం.. 10 మంది డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
కోల్‌కతాలో డాక్టర్ హత్యకేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: కోల్‌కతాలో డాక్టర్ హత్యకేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. 31 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడిసిన్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు పురోగతిపై 2024 ఆగస్టు 22 నాటికి స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని సుప్రీంకోర్టు కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సీనియర్ వైద్యులు, ప్రభుత్వ అధికారులు, మెడికల్ అసోసియేషన్ హెడ్‌లతో కూడిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 10 మంది ప్రముఖ వైద్యులతో ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనుండగా ఇందులో హైదరాబాద్ కు చెందిన డా. నాగేశ్వర్ రెడ్డి కూడా చోటు దక్కింది. కాగా ఈ టాస్క్ ఫోర్స్ పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి డాక్టర్‌ల భద్రతపై సిఫార్సులు చేయాలపి సూచించింది. అనంతరం ఈ విచారణను గురువారాని సూప్రీం కోర్టు వాయిదా వేసింది.
టాస్క్ ఫోర్స్‌లోని సభ్యులు
సర్జన్ వైస్ అడ్మిరల్ R సరిన్
డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి
డాక్టర్ ఎం శ్రీనివాస్
డా. ప్రతిమా మూర్తి
డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి
డాక్టర్ సౌమిత్ర రావత్
ప్రొఫెసర్ అనితా సక్సేనా, హెడ్ కార్డియాలజీ, ఎయిమ్స్ ఢిల్లీ
ప్రొఫెసర్ పల్లవి సప్రే, డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై
డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, న్యూరాలజీ విభాగం, AIIMS
జాతీయ టాస్క్‌ఫోర్స్‌లోని ఎక్స్ అఫిషియో సభ్యులు
భారత ప్రభుత్వానికి కేబినెట్ సెక్రటరీ
భారత ప్రభుత్వానికి హోం సెక్రటరీ