LAC News : తూర్పు లద్దాఖ్‌లో వెనుదిరిగిన సైన్యం
తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ(LAC) వెంట ఉన్న భారత్- చైనా(India - China) బలగాలు వెనుదిరిగాయి.
దిశ, వెబ్ డెస్క్ : తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ(LAC) వెంట ఉన్న భారత్- చైనా(India - China) బలగాలు వెనుదిరిగాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య సైన్యం ఉపసంహరణకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. ఈ క్రమంలో మూడురోజుల కిందట ఎల్‌ఏసీ వెంట బలగాల ఉపసంహరణ ప్రక్రియ మొదలవగా.. మంగళవారం నాటికి దాదాపు 90 శాతం పూర్తయ్యిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. భారత్, చైనా సైన్యాలు ఒకరి స్థావరాలను మరొకరు పరస్పరం తనిఖీ చేసుకుంటున్నాయని.. మౌలిక సదుపాయాలను సైతం తొలగించారా? లేదా? అనే విషయం క్లారిటీ కోసమే తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది.
తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్, దళాల స్థావరాలను ఇరు దేశాలు ఏర్పాటు చేసుకున్నాయి. అనంతరం గాల్వాన్ లోయలో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, చైనా సైన్యం మధ్య కమాండర్ చర్చలు జరిగాయి. అదే సమయంలో దౌత్య మార్గంలోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi), చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Jinping) మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల ఫలితంగా బలగాలను వెనక్కి తీసుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించడంతో నాలుగేళ్ల ప్రతిష్ఠంభనకు ఫుల్ స్టాప్ పడింది.