దిశ, వెబ్ డెస్క్: పెళ్లై నలుగురు పిల్లలు పుట్టాక ఓ మహిళ తన లవర్ తో లేచిపోయింది. దీంతో భార్యపై కోపాన్ని పెంచుకున్న భర్త.. ఎవరూ ఊహించని విధంగా లేచిపోయిన భార్యకు, ఆమె లవర్ కు పెద్ద షాకిచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బీహార్ రాష్ట్రంలోని ఖగేరియా జిల్లాకు చెందిన నీరజ్ కు 2009లో రూబీ దేవీ అనే యువతితో వివాహమైంది. అనంతరం వారికి నలుగురు పిల్లలు కూడా పుట్టారు. అయితే కొంతకాలంగా ముఖేశ్ అనే వ్యక్తితో రూబీ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరూ చాటుగా కలవడం మొదలు పెట్టారు.
విషయం తెలుసుకున్న భర్త.. పద్ధతి మార్చుకోవాలని భార్య రూబీని హెచ్చరించాడు. అదేవిధంగా తన భార్య జోలికి రావొద్దంటూ ముఖేశ్ కు పెద్ద మనుషుల సమక్షంలో గట్టి వార్నింగ్ ఇచ్చాడు నీరజ్. అయితే ఇవీమీ పట్టించుకోని రూబీ 2022లో ప్రియుడు ముఖేశ్ తో లేచిపోయింది. అనంతరం వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. దీంతో ఆమె భర్త నీరజ్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. స్థానిక పోలీస్ స్టేషన్ లో తన భార్యను ముఖేశ్ కిడ్నాప్ చేశాడంటూ ఫిర్యాదు చేశాడు.
అయితే ప్రియుడితో ఉండటానికే రూబీ సిద్ధపడటంతో నీరజ్ మరింత బాధపడ్డాడు. రూబీపైన, అలాగే తన భార్యను తనకు కాకుండా చేసిన ముఖేశ్ పైన నీరజ్ పగను పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ గట్టి సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ముఖేశ్ భార్యను కలిసి తన బాధనంతా వెళ్లబోసుకున్నాడు నీరజ్. తన భార్య రూబీ.. ముఖేశ్ ఒకిరినొకరు ఇష్టపడటం, ఇద్దరు పెళ్లి చేసుకోవడం.. ఇలా అన్నీ ముఖేశ్ భార్యకు పూసగుచ్చినట్లు చెప్పాడు నీరజ్. దీంతో తన భర్త ముఖేశ్ పై కోపాన్ని పెంచుకున్న ఆమె.. నీరజ్ కు దగ్గరైంది.
ఈ క్రమంలోనే సరిగ్గా ముఖేశ్ , రూబీ పెళ్లి చేసుకున్న ఏడాదికి అనగా 2023 ఫిబ్రవరిలో నీరజ్, ముఖేశ్ భార్య పెళ్లి చేసుకున్నారు. కొసమెరుపు ఏంటంటే ముఖేశ్ భార్య పేరు కూడా రూబీ దేవీనే. కాగా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘పెళ్లైనంకా కూడా లేచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నేనే ఇంకా సింగిల్ గా మిగిలిపోయా’’ అంటూ ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేయగా.. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని గుర్తు చేశాడు ఇంకో వ్యక్తి.
Also Read..