శివకాశీలో భారీ అగ్నిప్రమాదం..

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరుగాంచిన శివకాశి బాణసంచా గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-09-25 14:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పేరుగాంచిన శివకాశి బాణసంచా గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సమయంలో బాణసంచా గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం తో దద్దరిల్లిపోయింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాణాసంచా అత్యధికంగా నిల్వ ఉండటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. అగ్నిప్రమాదం చోటుచేసుకొన్న ప్రాంతం మొత్తం పొగతో నిండిపోవడంతో మంటలను ఆర్పడంలో అవాంతరాలు ఏర్పాడుతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది. ఎటువంటి అస్థి, ప్రాణ నష్టం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం శివకాశి బాణాసంచా గోదాముల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.


Similar News