Nipah : నిఫా లక్షణాలతో ఆస్పత్రిలో 8 మంది

దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్ సోకి ఈనెల 21న(ఆదివారం) 15 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటనతో కేరళలోని మలప్పురం జిల్లా హైఅలర్ట్‌పై ఉంది.

Update: 2024-07-25 19:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నిఫా వైరస్ సోకి ఈనెల 21న(ఆదివారం) 15 ఏళ్ల బాలుడు చనిపోయిన ఘటనతో కేరళలోని మలప్పురం జిల్లా హైఅలర్ట్‌పై ఉంది. సదరు బాలుడి కుటుంబంతో కాంటాక్ట్‌లో ఉన్న దాదాపు 472 మందిని గుర్తించగా.. వారిలో 220 మందికి హై రిస్క్ ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక బాలుడి కుటుంబం కాంటాక్ట్ లిస్టులోని మరో ఎనిమిది మంది సీరం శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది.

ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్టులోని 66 మందికి ‘సీరం’ టెస్టుల్లో నెగెటివ్ ఫలితం వచ్చింది. అంటే వీరందరికీ నిఫా ఇన్ఫెక్షన్ లేదన్న మాట. నిఫా తరహా లక్షణాలతో మంజేరి, కోజికోడ్ మెడికల్ కాలేజీ హాస్పిటళ్లలో ఎనిమిది మంది చికిత్సపొందుతున్నారు. ఈవివరాలను కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ మీడియాకు వెల్లడించారు.

Tags:    

Similar News