Glass Bridge: దేశంలోనే తొలి గాజు వంతెన.. ఎక్కడంటే?
కన్యాకుమారిలో గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: కన్యాకుమారిలో గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించి దానిపైనుంచి ఆయన నడిచారు. కన్యాకుమారి (Kanyakumari) తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని (Thiruvalluvar statue) ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి బుధవారానికి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండ్రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. సముద్రం మధ్యన 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో అద్దాల వంతెనను నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు. గతేడాది మే 24న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. బుధవారం నుంచి సిల్వర్‌జూబ్లీ వేడుకల జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గాజు వంతెనను ప్రారంభించారు . ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.