Rajasthan: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు యువకులు మృతి

రాజస్థాన్‌‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అల్లుకున్నాయి.

Update: 2024-08-11 15:28 GMT
Rajasthan: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు యువకులు మృతి
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అల్లుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే, ఆదివారం భరత్‌పూర్‌లో శ్రీనగర్ గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు అక్కడి బంగంగా నదిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో నీళ్లలో లోతు ఎక్కువగా ఉండటంతో అందరూ నీటిలో మునిగిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలతో బయటపడగా, అతను గ్రామానికి చేరుకుని ప్రమాద విషయాన్ని గ్రామంలో చెప్పడంతో వెంటనే అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. మృతులను పవన్ సింగ్ జాతవ్ (20), సౌరభ్ జాతవ్ (18), గౌరవ్ జాతవ్ (16) (ఈ ముగ్గురు అన్నదమ్ములు), భూపేంద్ర జాతవ్ (18), శంతను జాతవ్ (18), లక్కీ జాతవ్ (20), పవన్ జాతవ్ (22) గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News