BPSC : బీపీఎస్సీ అభ్యర్థులకు రాహుల్ గాంధీ మద్దతివ్వాలి.. ప్రశాంత్ కిషోర్

బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-05 18:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) పాట్నాలో ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ (Tejaswi yadav) లు విద్యార్థులకు మద్దతివ్వాలని కోరారు. ఈ నిరసన రాజకీయాలకు అతీతమైందని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని సూచించారు. అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. విద్యార్థులు యువ సంఘర్ష్ సమితి పేరుతో 51 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని, ఇది ఆందోళనను ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News