ఉప ఎన్నికల్లో 63.23శాతం ఓటింగ్..అత్యధికంగా ఎక్కడంటే?

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

Update: 2024-07-10 17:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. 13 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 63.23శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ జరిగిన రాష్ట్రాలో పశ్చిమ బెంగాల్‌లో 4 సీట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2, మధ్యప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్‌లో ఒకొక్కి అసెంబ్లీ సీటులో ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా తమిళనాడులోని విక్రవండి అసెంబ్లీ స్థానంలో 77.73శాతం పోలింగ్ నమోదు కాగా..అత్యల్పంగా ఉత్తరాఖండ్‌లోని బద్రినాథ్ సెగ్మెంట్‌లో 47.68శాతంగా నమోదైంది. ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్‌లో బీజేపీ టీఎంసీ నాయకులు పరస్పరం ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ఉత్తరాఖండ్‌లోని మంగళూరులోనూ ఘర్షణ జరిగింది. కాగా, ఎన్నికల ఫలితాలు ఈనెల 13వ తేదీన విడుదల కానున్నాయి.


Similar News