ఆస్ట్రేలియాలో కత్తిపోట్ల కలకలం.. ఐదుగురు మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. బిజీ సెంటర్ అయిన సిడ్నీ మాల్ లోకి కొందరు దుండగులు ఎంటరయ్యి.. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. బిజీ సెంటర్ అయిన సిడ్నీ మాల్ లోకి కొందరు దుండగులు ఎంటరయ్యి.. విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈదాడుల్లో ఐదుగురు చనిపోయినట్లు సిడ్నీ పోలీసులు తెలిపారు. నిందితులపై కాల్పులు జరపగా ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు.
శనివారం మధ్యాహ్నం సిడ్నీలోని వెస్ట్‌ఫీల్డ్ బోండి జంక్షన్ మాల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒకరు చనిపోయారు.
మాల్‌లో ఉన్న వారిని సిబ్బంది వెంటనే అక్కడి నుంచి తరలించారు. పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో వారంతా తలదాచుకున్నారు. అటువైపుగా ఎవరూ రావొద్దని హెచ్చరించారు అధికారులు. మాల్‌కు తాళం వేసిన అధికారులు.. ఆ ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు.
కొన్ని మీడియా దృశ్యాల్లో.. ఒక వ్యక్తి పెద్ద కత్తితో మాల్‌లో తిరగడం కనిపించింది. గాయపడిన వ్యక్తులు నేలపై పడిపోయారు. వారిలో తల్లీబిడ్డ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దుండగులు ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు.