జైల్లో 44 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్..!
జైలులో శిక్ష అనుభవిస్తున్న 44 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ (HIV) సోకి... కలకలం సృష్టిస్తోన్న సంఘటన ఉత్తరఖండ్‌లో హల్ద్‌వాని జైలులో చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: జైలులో శిక్ష అనుభవిస్తున్న 44 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ (HIV) సోకి... కలకలం సృష్టిస్తోన్న సంఘటన ఉత్తరఖండ్‌లో హల్ద్‌వాని జైలులో చోటుచేసుకుంది. జైలులో ప్రస్తుతం 1629 మంది పురుషులు, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు. హెచ్‌ఐవీ సోకిన వారిలో కేవలం ఒక మహిళ మాత్రమే ఉండటం గమనార్హం. అయితే జైలులో ఎయిడ్స్ (AIDS) బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అధికారులు అపమత్తమయ్యారు.
బాధితుల కోసం అక్కడే ఏఆర్‌టీ (యాంటీ వైరస్ థెరఫీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సుశీలా తివారీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ పరమ్‌జిత్ సింగ్.. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. మరో విషయమేంటంటే... హెచ్‌ఐవీ సోకినవారంతా డ్రగ్స్ బానిసలేనని, క్రమం తప్పకుండా పరీక్షలు చేయిస్తున్నారని, దీనివల్ల వైరస్ బారినపడిన వారిని గుర్తించి వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.