40 మంది భార్యలకు ఒక్కడే భర్త.. అధికారుల షాక్

40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా పేరుగా చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు.

Update: 2023-04-26 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా పేరుగా చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. బీహార్ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ రెండో దశ కులగణన జరుగుతోంది. అందులో భాగంగా కుటుంబానికి సంబంధించిన క్యాస్ట్, ఎడ్యుకేషన్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ స్థితిగతులను అధికారులు నమోదు చేస్తున్నారు. సర్వేలో భాగంగా అర్వల్ జిల్లాలోనే ఓ రెడ్ లైట్ ఏరియాలో నివాసం ఉంటున్న వారి డిటైల్స్ తీసుకోవడానికి అధికారులు వెళ్లారు.

అయితే అక్కడ అధికారులకు స్థానికంగా ఉండే 40 మంది మహిళలు చెప్పిన సమాధానాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. వీరంతా తమ భర్త పేరు రూప్ చంద్ అని చెప్పారు. పిల్లలు సైతం తమ తండ్రి పేరు రూప్ చంద్ అని చెప్పారు. దీంతో అధికారులు షాక్ అయ్యారు. అయితే వీరంతా అలా ఎందుకు చెబుతున్నారని అధికారులు ఎంక్వైరీ చేయగా రెడ్ లైట్ ఏరియాలో రూప్ చంద్ నివాసం ఉంటున్నాడు. స్థానికంగా డ్యాన్సర్ గా ఉన్నాడు. అతడిపై అభిమానంతో మహిళలు రూప్ చంద్ పేరును తమ భర్తగా చెబుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉండే వారికి మగదిక్కు లేదని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News