ఎయిర్‌పోర్ట్‌లో భారీ కలకలం! సినీనటుడి బ్యాగులో 40 బుల్లెట్స్..
చెన్నై విమానశ్రయంలో సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: చెన్నై విమానశ్రయంలో సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల బ్యాగులను తనిఖీలు చేస్తున్న భద్రత సిబ్బంది.. నటుడు కరుణాస్ బ్యాగును స్కాన్ చేశారు. అప్పుడు హ్యాండ్‌బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉందని అలారం మోగింది. దీంతో భద్రతా అధికారులు హ్యాండ్‌బ్యాగ్‌ని తెరిచి పరిశీలించారు. మొత్తం 40 లైవ్ రౌండ్‌ల కోసం రెండు పెట్టెల్లో ఒక్కొక్కటి 20 రౌండ్‌లు ఉన్నాయి. అవన్నీ 32 ఎంఎం పిస్టల్ క్యాలిబర్ కాట్రిడ్జ్‌లు. దీంతో వెంటనే భద్రతా అధికారులు బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకోని విచారణ చేశారు.
దీనిపై కరుణాస్ మాట్లాడుతూ.. ‘నేను తుపాకీ లైసెన్స్‌దారుని.. నా పిస్టల్‌లో వాడే బుల్లెట్‌లు ఇవి.. విమానంలో బుల్లెట్లు తీసుకెళ్లకూడదని నిబంధన ఉందని నాకు తెలుసు. కానీ హడావుడిగా వెళ్లిపోతుండడంతో బ్యాగ్‌లో బుల్లెట్ల బాక్సులను గమనించలేదు’ అని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో నిబంధనల ప్రకారం తుపాకీని తన స్వగ్రామం డిండిగల్‌లోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు చెప్పారు. అయితే, హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లు మాత్రం ఉండిపోయాయని తెలిపారు. కరుణాస్ తన తుపాకీని ఇప్పటికే పోలీసు స్టేషన్‌లో సబ్మిట్ చేసిన సంబంధిత పత్రాలను అధికారులకు చూపించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున బుల్లెట్లను తీసుకెళ్లవద్దని సూచించి, అతని బ్యాగ్‌ను తిరిగి ఇచ్చారు.