ఐదు దశల్లో ఎన్డీయేకు 310 సీట్లు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్డీయే 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. మిగతా రెండు దశలు పూర్తయ్యే నాటికి 400 సీట్లు సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Update: 2024-05-21 12:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే ఎన్డీయే 310 సీట్లు గెలుచుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. మిగతా రెండు దశలు పూర్తయ్యే నాటికి 400 సీట్లు సాధించడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఒడిశాలో బీజేపీ వికసించబోతుందని చెప్పారు. ఒడిశాలో ‘కొద్ది మంది అధికారులు పాలన సాగిస్తున్నారని ఆరోపించిన అమిత్ షా..మరికొన్ని రోజుల్లోనే దీనికి బ్రేక్ పడుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధిక గనులు, ఖనిజ నిల్వలు రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలోనే ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ఇక్కడ ఉన్న గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆరోపించారు.

పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మోడీ తగిన సమాధానం ఇచ్చారని, కాంగ్రెస్ నేతలు చేస్తున్న అణుబాంబు బెదిరింపులకు తాము భయపడబోమని తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌(పీఓకే)ను భారత్‌లో తప్పకుండా విలీనం చేస్తామన్నారు. కాంగ్రెస్ గిరిజనులకు చేసిందేమీ లేదని, మాజీ ప్రధాని వాజ్‌పేయి గిరిజన వ్యవహారాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. బీజేడీ ప్రభుత్వం ఒడిశా భాష, సంస్కృతి, సంప్రదాయాన్ని అవమానించిందని తెలిపారు. జగన్నాథ ఆలయాన్ని వాణిజ్య కేంద్రంగా మార్చాలని భావిస్తోందని, అంతేగాక పూరీలో మఠాలు, ఆలయాలు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథుని రథయాత్రను నిలిపివేయడానికి కూడా కుట్ర జరిగిందన్నారు.

Tags:    

Similar News