గూగుల్‌లో 30వేల మంది ఉద్యోగాలు ఊస్ట్.. కారణమిదే..!

రంగంలో ఈ మధ్య దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసింది.

Update: 2023-12-27 13:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్ రంగంలో ఈ మధ్య దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసింది. తాజాగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణంగా గుగూల్‌లో ఉద్యోగులు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక కారణాలతో ఇప్పటికే 12 వేలా మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్‌ మరింత మందిని ఇంటికి పంపడానికి సిద్ధమవుతున్నది. యాడ్‌ సేల్స్‌ యూనిట్‌లోని 30 వేల మందికి ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏఐ సాంకేతికత సాయంతో కొత్త యాడ్‌లను సృష్టిస్తున్నది. దీని కారణంగా గూగుల్ వార్షిక ఆదాయం పెరిగింది. దీంతో ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులపై వేటు పడింది. ఉద్యోగుల సేవలు అంతగా అవసరం లేకపోవడంతో ఈ విభాగంలో ఉద్యోగాల తొలగిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News