Gun Fire : తుపాకీ పేలి రెండేళ్ల బాలుడి చేతిలో తల్లి మృతి.. విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..?
ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రెండేళ్ల బాలుడి చేతిలో తల్లి మృతి చెందింది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రమాదవశాత్తు తుపాకీ పేలి రెండేళ్ల బాలుడి చేతిలో తల్లి మృతి చెందింది. ఈ విషాద ఘటన అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘బెడ్ రూమ్‌లో ఉంచిన తుపాకీని రెండేళ్ల బాలుడు తీసి ఆడుకుంటున్నాడు. ఒక్క సారిగా ట్రిగ్గర్ నొక్కాడు. ఈ ఘటనలో బెడ్‌పై నిద్రిస్తున్న తల్లి జెస్సిన్యా మినా(22) బాడీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే మృతురాలి తల్లి ఆమెను ఆస్పత్రికి తరలించింది. అప్పటికే మినా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మినా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ సాంచెజ్ 9ఎంఎం గన్ లోడ్ చేసి బెడ్ రూమ్‌లో ఉంచాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశాం.’ అని పోలీసులు తెలిపారు. ఇటీవల అమెరికా కార్నిఫోర్నియాలో ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పార్క్ చేసిన ట్రక్కులో కూర్చున్న ఏడేళ్ల బాలుడి చేతిలో తుపాకీ పేలడంతో రెండేళ్ల తన సోదరుడు దుర్మరణం చెందాడు.