JK Encounter: జమ్ముకశ్మీర్ లో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir) కిష్త్వార్‌లో(Kishtwar) భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు(JK Encounter) కొనసాగుతున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir) కిష్త్వార్‌లో(Kishtwar) భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు(JK Encounter) కొనసాగుతున్నాయి. ముష్కరుల కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) కూడా ఉన్నారు. 24 గంటల వ్యవధిలో జరిగిన మూడో ఎన్ కౌంటర్ ఇది. కాగా.. రెండ్రోజుల క్రితం ఇద్దరు గ్రామస్థులను ఉగ్రవాదులు చంపారు. దీంతో అక్కడ ముష్కరులు ఉన్నారనే అనుమానంతో భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భద్రతాబలగాలు అంచనా వేస్తున్నాయి. ఆ ఉగ్రవాదులే గ్రామస్థులను చంపినట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాది హతం
ఆదివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని(Srinagar) జబర్వాన్ అడవుల్లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారం అధారంగా జబర్వాన్ అటవీ ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. దీంతో, భద్రతాబలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇకపోతే, బారాముల్లా(Baramullah) జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని ఆర్మీ తెలిపింది.