1984 Anti-Sikh Riots: 'సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు ఫైల్‌ను వెంటనే పంపండి'.. ఢిల్లీ ఏసీఎంఎం ఆదేశం

కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్‌పై నమోదైన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు విచారణ వేగాన్ని పుంజుకుంది.

Update: 2023-07-06 16:58 GMT

ఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు జగదీష్ టైట్లర్‌పై నమోదైన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు విచారణ వేగాన్ని పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను శుక్రవారం ఉదయం 11 గంటలలోగా సమర్పించాల్సిందిగా ఢిల్లీలోని కర్కర్‌ దూమా ట్రయల్ కోర్టు రికార్డు రూమ్ ఇన్‌చార్జికి.. ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) విధి గుప్తా ఆనంద్ గురువారం నోటీసు జారీ చేశారు.

టైట్లర్ వాయిస్ శాంపిల్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ పరీక్ష ప్రక్రియను వేగవంతం చేయాలని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి రిమైండర్ పంపామని ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఇందిరాగాంధీ హత్యకు గురైన ఒక రోజు తర్వాత (1984 నవంబర్ 1న) ఢిల్లీలోని పుల్ బంగాష్ ఏరియాలో సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారణమయ్యారనే అభియోగాలను జగదీష్ టైట్లర్‌ ఎదుర్కొంటున్నారు. ఆ అల్లర్లలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, గురుద్వారాకు నిప్ప్పుపెట్టారు.


Similar News