16 రకాల కీటకాలను ఆహారంగా తినొచ్చు..ఎక్కడంటే?

సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16రకాల కీటకాలను ఆహారంగా తినేందుకు ఆమోదించింది. ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Update: 2024-07-08 16:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16రకాల కీటకాలను తినేందుకు ఆమోదించింది. ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మిడతలు, పట్టు పురుగులు, గొల్లభామ సహా మొత్తం 16 కీటకాలను ఆహారంలో భాగం చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో తక్కువ నియంత్రణ కలిగి ఉన్నట్లు అంచనా వేయబడే జాతులకు చెందిన కీటకాలు, వాటి ఉత్పత్తులను సింగపూర్‌కు దిగుమతి చేసుకునేందుకు వీలు కలుగుతుంది. అయితే ఆహార భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉండాలని వెల్లడించింది. ఈ నిర్ణయంతో కీటకాలతో ఆహారం తయారుచేసే హోటల్స్, రెస్టారెంట్ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. కీటకాలతో వంటకాలు తయారు చేసి కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్దమవుతున్నాయి.


Similar News