Wayanad landslides: జలవిలయంలో 143కి చేరిన మృతుల సంఖ్య

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్యశాఖ ప్రకటన చేసింది.

Update: 2024-07-31 04:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్యశాఖ ప్రకటన చేసింది. గాయపడిన మరో 128 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా స్థలిలో సహాయకచర్యలు చేపడుతున్నాయి. వయనాడ్‌ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల, అట్టామల, నూల్పుజా గ్రామాల్లో పరిస్థఇతి అధ్వానంగా తయారైంది. కొండ చరియలు విరిగిపడి గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే అసోం, బెంగాల్ కు చెందిన 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు.

అసలేం జరిగిందంటే?

ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. రోడ్లు మూసుకుపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. వయనాడ్ జిల్లాలో ఘటన జరగకుముందు.. గడిచిన 24 గంటల్లో 372 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గ్రామస్థులంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం అంతా విధ్వంసమైంది. ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయిన గ్రామస్థులు ఆ మట్టిలోనే కలిసిపోయారు. ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. బాధఇతులను చుర్మలలోని వెల్లారిమల స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరానికి అధికారులు తరలించారు. కాగా.. మంగళవారం తెల్లవారుజామున 4.10 గంటలకు ఈ పాఠశాల సమీపంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంసహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కూరుకుపోయాయి. అనేక వాహనాలు అందులో ఇరుక్కుపోయాయి. చురల్మల గ్రామం ఆనవాళ్లు లేకుండా పోయింది. ముండకైలో మంగళవారం మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి


Similar News