దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకున్న 12 చీతాలు

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువస్తున్న 12 చీతాలు శనివారం ఉదయం భారత్ కు చేరుకున్నాయి.

Update: 2023-02-18 05:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువస్తున్న 12 చీతాలు శనివారం ఉదయం భారత్ కు చేరుకున్నాయి. శుక్రవారం జోహన్నేస్ బర్గ్ విమానాశ్రయం నుంచి చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం గ్వాలియర్ వాయుసేన స్థావరానికి చేరుకుంది. అక్కడి నుంచి ఆ చీతాలను హెలికాప్టర్లరో మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కుకు తరలించారు. భారత్ కు తరలించిన చీతాలలో 7 మగ, 5 ఆడ చీతాలు ఉన్నాయి.

ఈ చీతాలను తొలుత నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచనున్నారు. భారత్ లో అంతరించిపోయిన చీతాలను తిరిగి సంరక్షించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి భారత్ కు చీతాలను తీసుకువస్తోంది. గతేడాది సెప్టెంబర్ లో 8 చీతాలను నమీబియా నుంచి భారత్ కు తీసుకురాగా వాటిని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా కూనో జాతీయ పార్కులో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News