చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం స్వాధీనం..ఇద్దరు నిందితుల అరెస్ట్

లడఖ్‌లోని భారత్ చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108కిలోల బంగారు కడ్డీలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-07-10 15:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లడఖ్‌లోని భారత్ చైనా సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న 108కిలోల బంగారు కడ్డీలను ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దను వ్యక్తులను అరెస్ట్ చేశారు. తూర్పు లఢఖ్‌లో 18,000 అడుగుల ఎత్తులో భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం స్మగ్లింగ్ గురించి సమాచారం అవడంతో అప్రమత్తమయ్యారు. ఇండో-చైనా సరిహద్దుకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సిరిగాప్లే సమీపంలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. వారిని తనిఖీ చేయగా..108 బంగారు కడ్డీలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఐటీబీపీ టెన్జిన్ టార్గీ, సెరింగ్ చంబా అనే వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద మొబైల్ ఫోన్లు, బైనాక్యులర్లు, చైనా ఆహార పదార్థాలు కనుగొన్నారు. బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు అప్పగించారు. వాటి విలువ సుమారుగా రూ. 70కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Similar News