షెడ్యూల్డ్ కులాల భూ వివాదాలు పరిష్కరించాలి

దిశ, హైదరాబాద్: నగరంలో షెడ్యూల్డ్ కులాల భూవివాదాలు పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహాంతిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు కోరారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన అంశాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డి అన్నారం, ఐమ్యాక్స్ థియేటర్ ప్రాంతాల్లో పేదల సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. చాదర్‌ఘాట్‌లో దళిత మైనర్ బాలికపై జరిగిన ఉదంతంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అట్రాసిటీ […]

Update: 2020-05-30 08:11 GMT

దిశ, హైదరాబాద్: నగరంలో షెడ్యూల్డ్ కులాల భూవివాదాలు పరిష్కరించాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహాంతిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె.రాములు కోరారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన అంశాలపై శనివారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డి అన్నారం, ఐమ్యాక్స్ థియేటర్ ప్రాంతాల్లో పేదల సమస్యలపై దృష్టిసారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. చాదర్‌ఘాట్‌లో దళిత మైనర్ బాలికపై జరిగిన ఉదంతంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరారు. అట్రాసిటీ కేసులను సకాలంలో పరిష్కరించడమే కాకుండా, బాధితులకు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి, జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహాంతి, జిల్లా అడిషనల్ కలెక్టర్ కృష్ణ, ఆర్డీవోలు శ్రీను, వసంతకుమారి, సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు పాల్గొన్నారు.

Tags:    

Similar News