తెలంగాణ అటవీ కాలేజీకి జాతీయ స్థాయి గుర్తింపు

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అటవీ కాలేజీల ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఏ ప్లస్ కేటగిరి విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, స్టూడెంట్స్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి ధీటుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 2015‌లో కాలేజీ స్థాపించగా 2016లో […]

Update: 2020-06-18 09:40 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అటవీ కాలేజీల ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఏ ప్లస్ కేటగిరి విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, స్టూడెంట్స్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి ధీటుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 2015‌లో కాలేజీ స్థాపించగా 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ మొదటి బ్యాచ్ నాలుగేళ్ల కోర్సుతో ప్రారంభమైంది. ఈ ఏడాది ఫైనలియర్ స్టూడెంట్స్ తమ కోర్సును పూర్తి చేసుకుంటున్నారు. ముందుగా దూలపల్లి ఫారెస్ట్ అకాడమిలో మొదలైన కాలేజీ గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ శివారు ములుగులో సొంత క్యాంపస్‌లోకి మారింది. అధునాతన సౌకర్యాలు, వసతులతో ఏర్పాటైన కొత్త క్యాంపస్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటించటంతో పాటు బ్రిటిష్ కొలంబియా, అబర్న్ యూనివర్సిటీలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఇటీవలే ఓ విద్యార్థినికి అబర్న్ యూనివర్సిటీ ఉచితంగా ఎంఎస్సీ సీటును ఆఫర్ చేసింది.

Tags:    

Similar News