బులెటిన్ రిలీజ్.. మొత్తం కేసులు 15,31,669
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని విధాలు ప్రయత్నించినా దాని కరాళ నృత్యం ఆగడంలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. 768 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 లక్షల […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. కరోనా దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు ఎన్ని విధాలు ప్రయత్నించినా దాని కరాళ నృత్యం ఆగడంలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
తాజాగా గడిచిన 24 గంటల్లో 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. 768 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 లక్షల 31 వేల 669 కు చేరుకుంది. ఇందులో 9 లక్షల 88 వేల 029 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 5 లక్షల 50,447 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా, ఇప్పటివరకు భారత్ లో 1.77 కోట్ల కరోనా పరీక్షలు చేయగా, అందులో గడిచిన 24 గంటల్లో 4.08 లక్షల కరోనా టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.