డాక్టర్ కందికంటి వెంకన్నకు జాతీయ పురస్కారం
దిశ, ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన డాక్టర్ కందికంటి వెంకన్న జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైనట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విపత్కర సమయంలో హైదరాబాద్ నగరంలో పోలీసులకు, వికలాంగుల కుటుంబాలకు, వలస కార్మికులకు కందికంటి వెంకన్న చేసిన సేవలను గుర్తించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘‘సత్యక్ మానవా సేవా సమితి’’ ఆధ్వర్యంలో డాక్టర్ కందికంటి వెంకన్నకు జాతీయ స్థాయి ‘‘కరోనా యోదా సమ్మన్’’ అవార్డును అందిస్తున్నట్టు ఆ […]
దిశ, ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సురాబాద్ డివిజన్‌కు చెందిన డాక్టర్ కందికంటి వెంకన్న జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికైనట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విపత్కర సమయంలో హైదరాబాద్ నగరంలో పోలీసులకు, వికలాంగుల కుటుంబాలకు, వలస కార్మికులకు కందికంటి వెంకన్న చేసిన సేవలను గుర్తించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ‘‘సత్యక్ మానవా సేవా సమితి’’ ఆధ్వర్యంలో డాక్టర్ కందికంటి వెంకన్నకు జాతీయ స్థాయి ‘‘కరోనా యోదా సమ్మన్’’ అవార్డును అందిస్తున్నట్టు ఆ సంస్థ ఫౌండర్, డైరెక్టర్ అజయ్ శర్మ వెల్లడించారు.