యంగ్ సూర్యుడిలా మరో నక్షత్రం..సైంటిస్టులు ఏమన్నారంటే..?

దిశ, ఫీచర్స్: సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే విశ్వంలోని ఎన్నో రహస్యాలను ఛేదించగా.. తాజాగా యంగ్ సూర్యుడికి దగ్గరి పోలికలున్న ఓ నక్షత్రాన్ని కనుగొన్నట్టు నాసా రీసెర్చర్స్ వెల్లడించారు. సూర్యుడి గురించిన మరిన్ని వివరాలతో పాటు భూమిపై జీవవికాసం అభివృద్ధి క్రమాన్ని తెలుసుకునే లక్ష్యంతో ఈ కొత్త అధ్యయనాన్ని చేపట్టారు. 4.65 బిలియన్ సంవత్సరాల వయసులో ఉన్న సూర్యుడిని ‘మిడిల్ ఏజ్ స్టార్’గా […]

Update: 2021-08-04 02:43 GMT

దిశ, ఫీచర్స్: సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఇప్పటికే విశ్వంలోని ఎన్నో రహస్యాలను ఛేదించగా.. తాజాగా యంగ్ సూర్యుడికి దగ్గరి పోలికలున్న ఓ నక్షత్రాన్ని కనుగొన్నట్టు నాసా రీసెర్చర్స్ వెల్లడించారు. సూర్యుడి గురించిన మరిన్ని వివరాలతో పాటు భూమిపై జీవవికాసం అభివృద్ధి క్రమాన్ని తెలుసుకునే లక్ష్యంతో ఈ కొత్త అధ్యయనాన్ని చేపట్టారు.

4.65 బిలియన్ సంవత్సరాల వయసులో ఉన్న సూర్యుడిని ‘మిడిల్ ఏజ్ స్టార్’గా పేర్కొన్న నాసా.. యంగర్ డేస్‌లో భూమిపై జీవం పెరుగుదలకు సపోర్ట్ చేసిన తీరును తెలుసుకునేందుకు సైంటిస్టులు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపింది. సూర్యుడి వంటి లక్షణాలున్న కొత్త నక్షత్రంతో సూర్యుడి యంగ్ డేస్ ఫొటోలు పునర్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మేరీల్యాండ్‌, నాసాకు చెందిన సీనియర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త వ్లాదిమిర్ ఐరాపెటియన్ చెప్పారు.

ఈ మేరకు కొత్త నక్షత్రాలు ప్లాస్మా అని పిలువబడే సూపర్‌ హాట్ వాయువుతో తయారయ్యే ‘నక్షత్ర గాలులు(స్టెల్లార్ విండ్స్)’ను విడుదల చేస్తాయని నాసా తెలిపింది. అత్యంత శక్తివంతమైన ప్లాస్మా.. నక్షత్ర వాతావరణం వెలుపల హాటెస్ట్ పార్ట్‌లో పెరిగిన ఆవిరి విస్ఫోటనం చెంది స్టెల్లార్ విండ్స్ రూపంలో సమీపంలోని గ్రహాల వైపు దూసుకొస్తుందని చెప్పారు. యంగర్ స్టార్స్.. పాత నక్షత్రాల కంటే ఎక్కువ ‘శక్తివంతమైన ప్లాస్మా విస్ఫోటనాలకు’ దారితీస్తాయని, ఇవి సమీప గ్రహాల వాతావరణాన్ని ఏ దశలోనైనా ప్రభావితం చేయగలవని ఈ అంతరిక్ష సంస్థ తెలిపింది. సూర్యుడు తన యవ్వనంలో అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉండి మూడు రెట్లు వేగంగా తిరిగాడని.. రేడియేషన్, కణాలతో సహా మరింత శక్తిని విడుదల చేశాడని” పరిశోధకులు తెలిపారు.

శాస్త్రవేత్తలు సూర్యుని యవ్వనం వెనుక ఉన్న రహస్యాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే గెలాక్సీలోని ఇతర నక్షత్రాల స్టెల్లార్ విండ్స్‌ చాలా దూరంలో ఉన్నందున వాటిని ప్రత్యక్షంగా గమనించడం ఇప్పటికీ సాధ్యం కాదు. అందువల్ల, ఈ అధ్యయనం ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ డేటాపై అంచనాల ఆధారంగా ‘సైంటిఫిక్ మోడలింగ్’పై ఆధారపడుతోంది. కాగా మునుపటి అధ్యయనాలు.. యంగ్ సోలార్ ప్రాక్సీ ‘కప్ప 1 సెటి’ని గుర్తించడానికి ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS), హబుల్ స్పేస్ టెలిస్కోప్ (HST) సేకరించిన డేటాపై ఆధారపడ్డాయి.

 

Tags:    

Similar News