నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్..
దిశ మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆశ్రిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కుక్కలను చంపి ఆలయ భూముల్లో కుక్కల కళేబరాలని పాతి పెట్టారు. విషయం తెలుసుకున్న పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. […]
దిశ మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆశ్రిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల కుక్కలను చంపి ఆలయ భూముల్లో కుక్కల కళేబరాలని పాతి పెట్టారు. విషయం తెలుసుకున్న పీపుల్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ సంస్థ ప్రతినిధులు మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా సంస్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ గంగరాజు, జిల్లా పశు సంవర్ధక ఏడీ డా.జనార్ధన రావు, వీఆర్ఓ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కుక్కలను పాతిన చోటికి వెళ్లి జేసీబీ సాయంతో త్వవించారు. కళేబరాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సత్యనారాయణ నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్‌ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ జీవనాధార భత్యం అందుతుందని, ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్‌కు రాజకీయ కారణాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. చైర్మన్ ,ఎమ్మెల్యేల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, వాటి కారణంగా ఇది జరిగిందని తెలుస్తుంది.