నా తల్లి వ్యాక్సిన్ తీసుకుంది.. ఆనందంతో మోదీ ట్వీట్
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్లో వెల్లడించారు. ‘ఈ రోజు నా తల్లి COVID-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్న మీ చుట్టూ ఉన్నవారికి […]
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక ట్విట్టర్లో వెల్లడించారు.
‘ఈ రోజు నా తల్లి COVID-19 వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్న మీ చుట్టూ ఉన్నవారికి సహాయం చేసి, వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను’ అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు.