నరసరావుపేటలో వైద్యుడికి కరోనా పాజిటివ్!

దిశ, గుంటూరు: ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ ప్రముఖ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు ఆయనతో సహా ఆసుపత్రి సిబ్బంది, 167 మంది ఔట్ పేషెంట్‌లను క్వారంటైన్‌కు తరలించినట్టు గుంటూరు రూరల్ ఎస్‌పీ విజయారావు తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పొందుగుల చెక్‌పోస్త్ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌పీ వెల్లడించారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించామని, కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు […]

Update: 2020-04-26 09:17 GMT

దిశ, గుంటూరు: ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ ప్రముఖ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు ఆయనతో సహా ఆసుపత్రి సిబ్బంది, 167 మంది ఔట్ పేషెంట్‌లను క్వారంటైన్‌కు తరలించినట్టు గుంటూరు రూరల్ ఎస్‌పీ విజయారావు తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పొందుగుల చెక్‌పోస్త్ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్‌పీ వెల్లడించారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అధికారులను నియమించామని, కరోనాను నియంత్రించేందుకు లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలు పరుస్తున్నట్టు స్పష్టం చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు, కరోనా లక్షణాలున్నాయని అనుమానం వచ్చిన వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 214 కేసులు నమోదయ్యాయి. వీరిలో 29 మంది డిశ్చార్జ్ కాగా, 177 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Tags: guntur, doctor, corona attacked to doctor, sp

Tags:    

Similar News