ఆ విషయంలో ప్రభుత్వం విఫలం.. నారాలోకేష్ సంచలన వ్యాఖ్యలు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడంలో..ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ట్విటర్ వేదికగా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ మోహం చూసి.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాయమాటలు విని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మెట్టు మెట్టు […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడంలో..ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ట్విటర్ వేదికగా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ మోహం చూసి.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాయమాటలు విని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మెట్టు మెట్టు పేర్చుకుంటూ.. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పోటీ పడి మరీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీని మొదటి 5 స్థానాల్లో నిలుపుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. ‘జగన్ దరిద్ర పాదానికి, అరాచకం తోడయ్యి, ఇప్పుడు విదేశీ పెట్టుబడులను ఆకర్షించటంలో మనం 13వ స్థానానికి దిగజారిపోయామని మండిపడ్డారు. మన పక్క రాష్ట్రాలన్నీ ఉన్నత స్థానంలోకి చేరుతుంటే… మన రాష్ట్రం మాత్రం రోజురోజుకు దిగజారిపోతోందని ధ్వజమెత్తారు.