జగన్ హామీలపై చర్చకు సిద్ధమా?: మంత్రి కన్నబాబుకు లోకేశ్ సవాల్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి కురసాల కన్నబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు దమ్ముంటే జగన్ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రెండోరోజు పర్యటిస్తున్న లోకేశ్.. మంత్రి కన్నబాబుపై మండిపడ్డారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని మంత్రి కన్నబాబు అనడం సరికాదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడం రెచ్చగొట్టడమా అని […]

Update: 2021-09-01 07:13 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ మంత్రి కురసాల కన్నబాబుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్నబాబుకు దమ్ముంటే జగన్ ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో రెండోరోజు పర్యటిస్తున్న లోకేశ్.. మంత్రి కన్నబాబుపై మండిపడ్డారు. తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నానని మంత్రి కన్నబాబు అనడం సరికాదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడం రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు.

పోలవరం ముంపు గ్రామాల్లోని ఇళ్లను బలవంతంగా కూల్చి వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముంపు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా బలవంతంగా తరలిస్తున్నారని ఇది న్యాయమా అన్నారు. ఢిల్లీలో అఖిలపక్షం పోరాటం చేస్తే రూ.10 లక్షల వంతున ఇస్తామని హడావిడిగా ప్రకటించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఆ ప్రకటన కేవలం ప్రకటనకే పరిమితమైందని ఇప్పటి వరకు ఆ డబ్బు ఇవ్వలేదని విమర్శించారు. తనపై విమర్శలు చేయడం కాదని దమ్ముంటే జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల మధ్యలో చర్చకు రావాలని నారా లోకేశ్ సవాల్ విసిరారు.

Tags:    

Similar News