అలా చేస్తే కరోనా పోతుందట.. నాని కొడుకు మెస్సేజ్

నేచురల్ స్టార్ నాని… హీరోగానే కాదు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఆయన నటించిన వి మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదాపడింది. త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్న నాని…ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ ను కొడుకుతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రాణాలు పోతున్నాయి అని ఇంటి పట్టునే ఉండాలని… చేతులు సరిగ్గా తరుచుగా శుభ్రం చేసుకోవాలని గతంలో ఓ వీడియో ద్వారా సూచనలు ఇచ్చిన నాని… ఇప్పుడు కొడుకు జున్నుతో ఓ […]

Update: 2020-04-14 08:00 GMT

నేచురల్ స్టార్ నాని… హీరోగానే కాదు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఆయన నటించిన వి మూవీ విడుదల కరోనా కారణంగా వాయిదాపడింది. త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్న నాని…ప్రస్తుతం లాక్ డౌన్ టైమ్ ను కొడుకుతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రాణాలు పోతున్నాయి అని ఇంటి పట్టునే ఉండాలని… చేతులు సరిగ్గా తరుచుగా శుభ్రం చేసుకోవాలని గతంలో ఓ వీడియో ద్వారా సూచనలు ఇచ్చిన నాని… ఇప్పుడు కొడుకు జున్నుతో ఓ మెసేజ్ వీడియో పంపించారు.

వీడియోలో జున్ను బయటకి చూస్తుండగా… జున్ను బయట ఏముందని అడుగుతాడు నాని. దానికి కరోనా ఉందని సమాధానం చెప్తాడు జున్ను. అప్పుడు మనం ఏం చేయాలి అని నాని అడగ్గా… ఇంట్లోనే ఉండాలని ముద్దు ముద్దుగా చెప్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అని నాని ప్రశ్నించగా.. కరోనా వైరస్ పోతుంది అని చెప్తాడు జున్ను. తద్వారా లాక్ డౌన్ పాటిస్తూ ఇంట్లోనే ఉంటే కరోనా మహమ్మారిని జయించవచ్చు అని… అందరం పాటిద్దమని సూచించారు తండ్రి కొడుకులు. జున్ను వాయిస్ కి పడిపోయాయని… ఆ ముద్దులొలికే మాటలను ఫాలో అవుతామని చెబుతున్నారు ఫ్యాన్స్.

Tags: Nani, Junnu, Tollywood, CoronaVirus, Corona, Covid19

Tags:    

Similar News